అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా నటించిన తాజా మువీ ‘కస్టడీ’. తాజాగా విడుదలైన ఈ మువీ ట్రైలర్‌ మంచి హైప్‌ క్రియేట్ చేసింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కస్టడీ’ చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉంది. దీనిలో భాగంగా నాగచైతన్య తాజా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ..

అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా నటించిన తాజా మువీ ‘కస్టడీ’. తాజాగా విడుదలైన ఈ మువీ ట్రైలర్‌ మంచి హైప్‌ క్రియేట్ చేసింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కస్టడీ’ చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉంది. దీనిలో భాగంగా నాగచైతన్య తాజా ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ..

వెంకట్‌ప్రభు ‘కస్టడీ’ కథ చెప్పిన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ చేస్తానని మాటిచ్చాను. నాకు ఈ కథ అంతలా నచ్చింది. తెలుగు, తమిళంలో ఒకేసారి దీన్ని తెరకెక్కించాం. ఈ మువీలో నేను పోలీస్‌ కానిస్టేబుల్‌గా కనిపించనున్నాను. ఏ సినిమాలోనైనా విలన్‌ని చంపాలని హీరో చూస్తుంటాడు. కానీ ఈ సినిమాలో నేను విలన్‌ను కాపాడాలనుకుంటాను ఎందుకంటే అతడు నా కస్టడీలో ఉంటాడు. అందుకే ఈ కథకు ‘కస్టడీ’ పేరు సరిగ్గా నప్పుతుందని అని చై చెప్పారు.

దర్శకుడు పరశురామ్ గురించి ఇంటర్వ్యూవర్‌ అడుగగా.. ‘అతని గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్. ఆయన నా సమయాన్ని వృధా చేసాడు. దీని గురించి మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదన్నాడు.‘మజిలీ’ దర్శకుడు శివ నిర్వాణతో మరో సినిమా చేయనున్నట్లు చై వెల్లడించారు. మరాఠీలో రీమేక్‌గా వచ్చిన మజిలీ మువీని ఇంకా చూడలేదని, త్వరలో తప్పకుండా చూస్తానని చై వివరించారు.

ఇవి కూడా చదవండిపరశురామ్‌తో వివాదం ఏమిటంటే..

మహేష్ బాబు సర్కారు వారి పాట మువీ కంటే ముందే, నాగ చైతన్యతో ఓ మువీ తీయబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఐతే కొన్ని కారణాల వల్ల అది ఆదిలోనే ఆగిపోయింది. సర్కారు వారి పాట బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన తర్వాత నాగ చైతన్య సినిమా కోసం మళ్లీ పని చేస్తున్నాడని, టైటిల్‌ కూడా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ మళ్లీ అగిపోయింది. కాగా పరశురామ్‌ ఇలాంటి ఆరోపణలు రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా టాప్ ప్రొడక్షన్స్ నుంచి అడ్వాన్స్ పేమెంట్ తీసుకుని తర్వాత పత్తాలేకుండా పోయాడనే వార్తలు వచ్చాయి. శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్‌పై తన తదుపరి మువీకి అల్లు అరవింద్ నుంచి భారీ మొత్తం తీసుకొని కమిట్ అయినట్లు సమాచారం. అయితే ఈ మువీ కూడా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. కారణాలు తెలియరాలేదు.

దర్శకుడు పరశురామ్ కెరీర్ గురించి..

పరశురామ్ 2008లో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘యువత’ చిత్రంతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ఆంజనేయులు (2009), సోలో (2011), శ్రీరస్తు శుభమస్తు (2016) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2018లో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించి గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో తీసిన సర్కారు వారి పాట ఎంత పెద్ద హిట్‌ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *