ఇప్పటికీ చైతూ, సామ్ ఎక్కడికి వెళ్లి డివోర్స్ గురించి ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల విడాకుల పై ఆసక్తిక విషయాలను చెప్పుకొచ్చారు చైతూ. సోషల్ మీడియా వల్లే తమ మధ్య మనస్పర్థలు వచ్చాయని అన్నారు. ఇక చైతూ కామెంట్లకు సామ్ ఇన్ స్టాలో పరొక్షంగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి డివోర్స్ పై స్పందించారు చైతూ.

అక్కినేని నాగచైతన్య.. స్టార్ హీరోయిన్ సమంత విడిపోయి రెండేళ్లు కావోస్తుంది. నాలుగేళ్లు ప్రేమ తర్వాత 2017లో ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో విడిపోయారు. తామిద్దరు డివోర్స్ తీసుకున్నామంటూ 2017 అక్టోబర్ 6న సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు చైతూ అండ్ సామ్. అయితే అప్పటి నుంచి వీరిద్దరి వ్యక్తిగత విషయాల గురించి నిత్యం సోషల్ మీడియాలలో అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఓవైపు సమంత ఇన్ స్టా పోస్ట్స్, ఆరోగ్య సమస్యలపై.. అలాగే చైతూ… శోభితా ధూళిపాళ్ల డేటింగ్ అంటూ అనేక రూమర్స్ నెట్టింట వైరలయ్యాయి. ఇక ఇప్పటికీ చైతూ, సామ్ ఎక్కడికి వెళ్లి డివోర్స్ గురించి ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల విడాకుల పై ఆసక్తిక విషయాలను చెప్పుకొచ్చారు చైతూ. సోషల్ మీడియా వల్లే తమ మధ్య మనస్పర్థలు వచ్చాయని అన్నారు. ఇక చైతూ కామెంట్లకు సామ్ ఇన్ స్టాలో పరొక్షంగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి డివోర్స్ పై స్పందించారు చైతూ.

తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కస్టడీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న చైతూ విడాకులు అయిపోయిందని.. ఇంకా ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు. కేవలం కొత్త సినిమాలు విడుదలైన శుక్రవారం.. అంతా ఒక్క రోజులోనే డిసైడ్ అయిపోద్దని అన్నారు. అలాగే తన సినిమాలు ఏవి విడుదలైనా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్.. రేటింగ్స్ అన్నీ చూస్తానని అన్నారు. కొన్నిసార్లు ఆ కామెంట్స్ చూస్తే ఎందుకు బ్రతుకున్నామో అనిపిస్తుందని.. అలాగే ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిస్తానని అన్నారు.

అలాగే డివోర్స్ అయిపోయిందని.. తాను, సమంత కలసి ఒక్కసారి అనౌన్స్ చేసామని.. అయినా హెడ్ లైన్స్ కోసం సాగదీయడం తప్పు అని అన్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న కస్టడీ చిత్రాన్ని తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో మే 12న రిలీజ్ చేయనున్నారు. ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed