
తెలుగు రాష్ట్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందడి మొదలైంది. మే 20న తారక్ పుట్టినరోజు కావడంతో ఇప్పటినుంచే సెలబ్రెషన్స్ షూరు చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆయన మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. కొద్దిరోజుల క్రితం స్టార్ట్ అయిన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జగుతుంది. అయితే తారక్ బర్త్ డే వస్తుండడంతో ఆరోజున అభిమానుల్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం మే 20న మోషన్ పోస్టర్ తోపాటు.. టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయనున్నారట.ఇందులో తారక్ ను అద్భుతంగా చూపించనున్నారటు. అయితే ఆయన సూచించిన టైటిల్ ను అందరూ ఆమోదిస్తే తారక్ బర్త్ డే రోజు కచ్చితంగా అనౌన్స్ చేస్తారు. డైరెక్టర్ ప్రస్తుతం ఓ టైటిల్ ను చెప్పారట.. దాన్ని అందరూ అంగీకరిస్తారో లేదే చూడాలి. మరోవైపు మే మూడో వారంలో చిత్రయూనిట్ మూడో షెడ్యూల్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారట.
మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో తారక్ రెజ్లర్ గా కనిపించనున్నాటు. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.