వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ అత్యంత ప్రతిష్ట్మాతంగా నిర్మిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈక్రమంలోనే తమ అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ బ్యానర్ పై రూపొందిన అన్నీ మంచి శకునములే మూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రోడ్యుసర్ స్వప్నదత్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ కె గురించిస ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధమవ్వగా.. మరోవైపు మూడు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె… బిగ్ బీ అమితాబ్ కీలకపాత్రలలో నటిస్తుండడంతో అంచనాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ అత్యంత ప్రతిష్ట్మాతంగా నిర్మిస్తుండగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈక్రమంలోనే తమ అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ బ్యానర్ పై రూపొందిన అన్నీ మంచి శకునములే మూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రోడ్యుసర్ స్వప్నదత్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ కె గురించిస ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

ప్రాజెక్ట్ కె మూవీ షూటింగ్ ఇప్పటివరకు 70 శాతం కంప్లీట్ అయ్యింది.. ప్రముఖ హాలీవుడ్ స్టూడియోస్ ఈ సినిమాను సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేస్తున్నాయని.. ప్రాజెక్ట్ కె ఎక్కువగా గ్రాఫిక్స్ తో కూడుకుని ఉంటుందని తెలిపారు. అందుకే ఈ సినిమా దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తైనప్పటికీ వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా సమయం పడుతుందని అన్నారు. సినిమా షూటింగ్ కంటే గ్రాఫిక్స్ పనులకే ఎక్కువ సమయం పట్టే అవకాశముందని అన్నారు.

ఇవి కూడా చదవండిఅలాగే ప్రాజెక్ట్ కె అనేది వర్కింగ్ టైటిలా.. లేదా అసలు టైటిల్ ఆ అని ప్రశ్నించగా.. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతామని అన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలకపాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మరింత క్యూరయాసిటిని పెంచాయి. ఈ సినిమాతోపాటు.. ప్రభాస్ సలార్ చిత్రంలోనూ నటిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *