పుష్ప 2లో మెగా డాటర్: ‘పుష్ప ది రూల్’ సినిమా గురించి గత కొంత కాలంగా అనేక వార్తలు తెరపైకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో కొందరు కీలక పాత్రలు పోషిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో నటిస్తున్న నటుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మెగా డాటర్  నిహారిక కూడా నటిస్తోందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

టాలీవుడ్ మూవీస్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాదు.. కార్తికేయ వంటి చిన్న సినిమాలకు కూడా  దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే మన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన ‘పుష్ప ది రైజ్’ సినిమా నార్త్ మొత్తాన్ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు పుష్ప కి సీక్వెల్‌గా ‘పుష్ప ది రూల్‘ రాబోతోంది. ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిస్తోందంటూ పుకార్లు షికారు చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ‘పుష్ప ది రైజ్’  బాలీవుడ్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత, రెండవ భాగంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ‘పుష్ప.. ది రూల్’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో పుష్ప రూలర్ గా ఎలా మారిందనేది హైలైట్ చేసి చూపించనున్నారని టాక్. ఫస్ట్ పార్ట్ కంటే ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.

‘పుష్ప ది రూల్’ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. 40 శాతానికి పైగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. అన్ని భాషల్లోనూ అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో అత్యధిక వ్యూస్‌తో రికార్డులు సృష్టించి అంచనాలను రెట్టింపు చేసింది.

ఇవి కూడా చదవండిపుష్ప 2లో మెగా డాటర్: ‘పుష్ప ది రూల్’ సినిమా గురించి గత కొంత కాలంగా అనేక వార్తలు తెరపైకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో కొందరు కీలక పాత్రలు పోషిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో నటిస్తున్న నటుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మెగా డాటర్  నిహారిక కూడా నటిస్తోందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రూల్’లో నిహారిక కొణిదెల గిరిజన అమ్మాయిగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది.అంతేకాదు ఆమె ఊహించని లుక్‌లో కనిపించనుందని, కొన్ని సాహసాలు కూడా చేయనుందని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించగా ఆమె తిరస్కరించిందట.

సినిమాకి మలుపు తిప్పే క్యారెక్టర్ : ‘పుష్ప ది రూల్’ సినిమాలో నిహారిక పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా నటిస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్ టాక్ వినిపిస్తోంది. గిరిజన యువతిగా పుష్పరాజ్ పక్కనే ఉంటూ పోలీసులకు సమాచారం ఇస్తుందట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ‘పుష్ప ది రూల్’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *