తొలి చిత్రానికే న్యూఫేస్ ఆఫ్ ది ఇయర్ కేటగిరిలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత హిందీలో దిల్ వాలే.. మోహ్రా, చిత్రాల్లో నటించి మెప్పించింది. 90’sలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా తనకంటూ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయంలేని పేరు. కేవలం ఒకే ఒక్క సినిమా ఆమెను పాన్ ఇండియా స్టార్‏ను చేసింది. ఉత్తరాదిలోనే కాకుండా.. దక్షిణాదిలోనూ ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది. ప్రముఖ దర్శకుడు రవి టాండన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవీనా టాంండన్.. అందం.. అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన రవీనా.. 1991లో సల్మాన్ ఖాన్ నటించిన పత్తర్ కే ఫూల్ సినిమాతో హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రానికే న్యూఫేస్ ఆఫ్ ది ఇయర్ కేటగిరిలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత హిందీలో దిల్ వాలే.. మోహ్రా, చిత్రాల్లో నటించి మెప్పించింది. 90’sలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా తనకంటూ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. చాలా సంవత్సరాల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యశ్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2లో రమికా సేన్ పాత్రలో నటించింది. ఇందులో హీరోను ఢీకొట్టే పాత్రలో తన నటనతో అదరగొట్టింది. ఇందులో ఆమె నటనకు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ వచ్చేసింది. ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీతో డేటింగ్ అనంతరం.. 2004 ఫిబ్రవరి 22న వీరిద్దరి వివాహం జరిగింది. రవీనా టాండన్ కు కూతురు రాషా.. కుమారుడు రణబీర్వర్దన్ ఉన్నారు.

అయితే సినిమాల్లోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది రవీనా. తన మూవీ అప్డేట్స్ మాత్రమే కాకుండా.. ఫ్యామిలీ పిక్స్ కూడా షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో రవీనా టాండన్ తన కూతురితో కలిసున్న ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ముఖ్యంగా రాషా చిన్నప్పటి నుంచి పెద్దయ్యేవరకు ఉన్న ఫోటోస్ హల్చల్ చేస్తున్నాయి. ఆ పిక్స్ చూసి రాషా అచ్చం తల్లిలాగే ఉందని.. అమ్మ అందమే అమ్మాయికి వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. తల్లి కూతురుగా కాకుండా అక్కచెల్లెల్లుగా ఉన్నారంటున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *