ది కేరళ స్టోరీపై కేరళలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేరళలో PVR సినిమాస్ సినిమా ప్రదర్శనలను రద్దు చేసింది. ఒబెరాన్ మాల్ తో పాటు, లులూ మాల్‌లలో ప్రదర్శనను రద్దు చేసింది. మరోవైపు అమ్మాయిల మిస్సింగ్ కథగా దేశమంతా ఈ సినిమాను సెన్సిటివ్‌గా చూడాలని చిత్రబృందం అంటోంది.

ది కేరళ స్టోరీపై కేరళలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేరళలో PVR సినిమాస్ సినిమా ప్రదర్శనలను రద్దు చేసింది. ఒబెరాన్ మాల్ తో పాటు, లులూ మాల్‌లలో ప్రదర్శనను రద్దు చేసింది. మరోవైపు అమ్మాయిల మిస్సింగ్ కథగా దేశమంతా ఈ సినిమాను సెన్సిటివ్‌గా చూడాలని చిత్రబృందం అంటోంది. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌ ఒకవైపు.. ఫ్రీడమ్‌ ఆఫ్ స్పీచ్‌ పేరుతో మత విద్వేషాలు రాజేస్తారా? అన్న నిరసనలు మరోవైపు.. ఇలా.. సినిమాపై దుమారం కొనసాగుతోంది. కర్నాటక ఎన్నికల నేపథ్యంలో ది కేరళ స్టోరీపై చర్చ మరింత వేడెక్కింది.

ది కేరళ స్టోరీ కాంట్రవర్సీ కాకరేపుతోంది. రాజకీయంగా కూడా దుమారానికి కేంద్రబిందువైంది. కొందరు సినిమాను సమర్ధిస్తుంటే.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓటుబ్యాంకు కోసం ఉగ్రమూలాలున్న సినిమాను కాంగ్రెస్‌ ప్రోత్సహిస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం భగ్గమన్నారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడం దారుణమన్నారు. ఎన్నికల ప్రచారంలో కేరళ సినిమాపై ప్రధాని మోదీ లాంటి వ్యక్తి దుష్ప్రచారం చేయడం తగదన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ. పాకిస్తాన్‌ నుంచి ఉగ్రవాదులు వచ్చి సైనికులను చంపేస్తుంటే, మణిపూర్‌ రగిలిపోతుంటే.. ఓ చెత్త సినిమాపై మాట్లాడడం విచారకరమన్నారు అసదుద్దీన్‌.

ది కేరళ స్టోరీపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ వినూత్నంగా స్పందించారు. మీ కేరళ కథ కావచ్చు.. కానీ మా కేరళ కథ మాత్రం కాదంటూ చురకలు అంటించారు. సినిమాను నిషేధించాలని మాత్రం కోరుకోవడం లేదన్న శశిథరూర్‌.. భావప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే దానికి విలువ ఉండదన్నారు. ఈ మూవీ వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉందని చెప్పే హక్కు కేరళవాసులకు ఉందన్నారు థరూర్‌.

ఇవి కూడా చదవండి



కేరళ వ్యతిరేక శక్తులు విద్వేషపూరితంగానే ఈ సినిమా తీశారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు. కేరళ ఖ్యాతిని తగ్గించే కుట్ర అన్నారు. మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశం ఉందని స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. మత సామరస్య వాతావరణానికి విఘాతం కలిగిస్తూ మతతత్వ విషబీజాలు నాటేలా సంఘ్‌ పరివార్‌ ప్రయత్నిస్తోందని కేరళ సీఎం పినరయి విజయన్‌ విరుచుకుపడ్డారు.

కథ నచ్చడం వల్లే ఈ సినిమా చేశాను తప్ప తనకు మరో ఉద్దేశం లేదన్నారు కీలక పాత్ర పోషించిన నటి అదా శర్మ. మంచి కథ అని ఫీల్‌ అయి మాత్రమే చేశానన్నారు. ఈ సినిమా చేయడంపై తమ కుటుంబసభ్యులు కూడా గర్వంగా ఫీలయ్యారని తెలిపింది అదా. ప్రజలకు తెలియాల్సిన కథలో తాను నటించినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సినిమా నటించినందుకు వందల కొద్దీ బెదిరింపు కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయని అదాశర్మ వాపోయింది. సినిమాలో షాలిని ఉన్నికృష్ణన్ మతం మార్చుకొని ఫాతిమాగా ఎలా మారింది? చివరికి ఆమె జీవితం ఎలా ముగిసిందనేది కథతో తీశారు. అందులో షాలినిగా అదా శర్మ నటించారు.

తన సినిమాపై వస్తున్న విమర్శల మీద డైరెక్టర్‌ సుదీప్తో సేన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఉగ్రవాదం మీద సినిమా తీశాను, ఉగ్రవాదానికి మతం లేనప్పుడు ఆ వాదన ఎక్కడి నుంచి వచ్చిందని ఎదురు ప్రశ్నించారు. ముందు సినిమాను చూడండి.. తర్వాత నచ్చకపోతే అప్పుడు చర్చిద్దామన్నారు. అందరం భారతీయులమేనన్న సుదీప్తో.. సినిమాలో ఎక్కడా ముస్లింలు, కేరళకు వ్యతిరేకంగా తీయలేదన్నారు.

సినిమాపై వస్తున్న వివాదం మీద కేరళ స్టేట్‌ కమిటీ ఆఫ్‌ ముస్లిం యూత్‌ లీగ్‌ తీవ్రంగా రియాక్ట్‌ అయింది. సినిమాలో లవ్‌ జీహాద్‌ ఆరోపణలను ఆధారాలతో నిరూపిస్తే కోటి రూపాయలను ఇస్తామని ప్రకటించింది. దీనిపై ప్రతీ జిల్లాలో ఆధారణ స్వీకరణ కోసం కలెక్షన్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చెప్పింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed