తమిళనాడులో ది కేరళ స్టోరీ సినిమా షోలు రద్దయ్యాయి. చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతో పాటు ముఖ్యనగరాల్లో మల్టీప్లెక్స్‌లలో షోలు రద్దు చేశారు. సినిమాను బ్యాన్‌ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. థియేటర్లను ముట్టడిస్తామని తమిళ పార్టీలు, ముస్లిం సంఘాలు హెచ్చరించాయి.

తమిళనాడులో ది కేరళ స్టోరీ సినిమా షోలు రద్దయ్యాయి. చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతో పాటు ముఖ్యనగరాల్లో మల్టీప్లెక్స్‌లలో షోలు రద్దు చేశారు. సినిమాను బ్యాన్‌ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. థియేటర్లను ముట్టడిస్తామని తమిళ పార్టీలు, ముస్లిం సంఘాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో అన్ని షోలను రద్దు చేశాయి థియేటర్ యాజమాన్యాలు.. ది కేరళ స్టోరీ కాంట్రవర్సీ కాకరేపుతోంది. కేరళలో 32 వేల మంది మహిళలు అదృశ్యం కావడంతో వారి ఆచూకీ ఎక్కడనే పాయింట్ తో ది కేరళ ఫైల్స్ చిత్రాన్ని దర్శకుడు సుదీప్తోసేన్ రూపొందించారు. కథ విషయానికొస్తే.. ఓ నలుగురు యువతులు మతం మారి ఆ తర్వాత ఐసిస్ లో చేరతారు. మతం మారిన అమ్మాయిలు ఉగ్రవాద శిక్షణ పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టినట్లు చూపించడం వివాదానికి తెర తీసింది.

ది కేరళ స్టోరీ రాజకీయంగా కూడా దుమారానికి కేంద్రబిందువైంది. కొందరు సినిమాను సమర్ధిస్తుంటే.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓటుబ్యాంకు కోసం ఉగ్ర మూలాలున్న సినిమాను కాంగ్రెస్‌ ప్రోత్సహిస్తోందంటూ ప్రధాని మోదీ భగ్గుమన్నారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడం సరికాదన్నారు. మరోవైపు కర్నాటక ఎన్నికల ప్రచారంలో కేరళ సినిమాపై ప్రధాని మోదీ లాంటి వ్యక్తి దుష్ప్రచారం చేయడం తగదన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ. పాకిస్తాన్‌ నుంచి ఉగ్రవాదులు వచ్చి సైనికులను చంపేస్తుంటే, మణిపూర్‌ రగిలిపోతుంటే.. ఓ చెత్త సినిమాపై మాట్లాడడం విచారకరమన్నారు అసదుద్దీన్‌.

అంతకుముందు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళను తీవ్రవాదులకు హెల్ప్ చేసే రాష్ట్రంగా చూపించడమేంటని ప్రశ్నించారు. ప్రపంచం ముందు తమను దోషులుగా నిలబెడుతున్నారని అన్నారు. విద్వేషాన్ని రగల్చడమే ధ్యేయంగా రూపొందించిన ఈ చిత్రాన్ని నిషేదించాలని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండిమరోవైపు సినిమాను తెరకెక్కించిన సుదీప్తో.. కథ కోసం దాదాపు ఏడేళ్లు రీసెర్చ్ చేశానన్నారు. టీజర్ కే ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారని అన్నారు. మొన్నటిదాకా టీజర్‌పై ఆగ్రహావేశాలు.. ఇప్పుడు సినిమా రిలీజ్‌తో బ్యాన్ చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. మొత్తానికి ది కేరళ స్టోరీ ఎన్నో వివాదాలకు కేరాఫ్‌గా మారింది.

మొన్నటిదాకా టీజర్‌పై ఆగ్రహావేశాలు.. ఇప్పుడు సినిమా రిలీజ్‌తో బ్యాన్ చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. మొత్తానికి ది కేరళ స్టోరీ ఎన్నో వివాదాలకు కేరాఫ్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *