తాజాగా ఓ ఇద్దరు స్టార్ హీరోస్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో ఉన్న ఇద్దరు చిన్నారు బావబామ్మర్దులు.. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోస్. సెలబ్రెటీస్ ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టిన హీరోగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఎవరో గుర్తుపట్టండి.

గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ దగ్గర్నుంచి.. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వరకు అందరి స్టార్స్ ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. తమ అభిమాన తారల అరుదైన ఫోటోస్.. వారి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి అభిమానులు సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఓ ఇద్దరు స్టార్ హీరోస్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో ఉన్న ఇద్దరు చిన్నారు బావబామ్మర్దులు.. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోస్. సెలబ్రెటీస్ ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టిన హీరోగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఎవరో గుర్తుపట్టండి.

ఆ ఇద్దరు చిన్నారు ఎవరో కాదు.. దగ్గుబాటి రానా.. అక్కినేని నాగచైతన్య. ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉందన్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున నటవారసుడిగా జోష్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన చైతూ.. తొలి సినిమాతోనే ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్ గా అంతగా హిట్ అవ్వకపోయినా.. నటనపరంగా మెప్పించాడు. ప్రస్తుతం కస్టడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటిస్తుడంగా.. మే 12న తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదల కాబోతుంది.

ఇక ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు రానా.. లీడర్ సినిమాతో హీరోగా పరిచమయ్యాడు. ఈ సినిమా విజయాన్ని అందుకోకపోయినా.. ఆ తర్వాత రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇందులో భల్లాల దేవ పాత్రలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో అదరగొట్టాడు రానా. చివరిసారిగా విరాటపర్వం సినిమాలో కనిపించిన రానా.. ఇటీవల తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *