పెళ్లి తర్వాత అటు సినీపరిశ్రమకు.. ఇటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. ఇటీవల నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకలో తన భర్తతో కలిసి సందడి చేసింది. ఇప్పటికైనా గుర్తుపట్టారా ?.. తను మరెవరో కాదు.

ఇండియన్ సినీపరిశ్రమలో ఈ బ్యూటీకి స్పెషల్ క్రేజ్ ఉంది. నార్త్ టూ సౌత్ ఈ హీరోయిన్‏కు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. కేవలం అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు సైతం ఈ ముద్దుగుమ్మకు వీరాభిమానులు. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. సల్మాన్ ఖాన్, షారుఖ్ సరసన నటించి మెప్పించిన ఈ అమ్మడు.. తెలుగులోనూ నటించింది. అయితే పెళ్లి తర్వాత అటు సినీపరిశ్రమకు.. ఇటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. ఇటీవల నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకలో తన భర్తతో కలిసి సందడి చేసింది. ఇప్పటికైనా గుర్తుపట్టారా ?.. తను మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

1983 జూలై 16న హాంకాంగ్ లోని విక్టోరియాలో జన్మించింది. ఆమె తండ్రి కశ్మీరీ కాగా.. తల్లి బ్రిటన్ కు చెందినవారు. 2003లో బూమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా కమర్షియల్ గా అంతగా హిట్ కాలేదు. కత్రీనాకు మాత్రం ఎక్కువగానే అవకాశాలు వచ్చాయి. ప్రేమ్ కీ గజబ్ కహానీ, రాజ్నీ తి, జిందగీ నా మిలేగీ దుబారా సినిమాల్లో నటించి మెప్పించింది. మేరే బ్రదర్ కీ దుల్హన్ సినిమాతో రెండోసారి ఫిలింఫేర్ ఉత్తమ నటిగా నామినేషన్ అందుకున్నారు.

2004లో విక్టరీ వెంకటేశ్ సరనస మల్లీశ్వరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా అప్పట్లో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ తెలుగులో మరో సినిమా చేయలేదు కత్రీనా. 2021 డిసెంబర్ 9న హీరో విక్కీ కౌశల్ ను వివాహం చేసుకున్నారు కత్రీనా. వీరి పెళ్లి రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ లోని ఫోప్ట్ బార్వారాలోని సిక్స్ సెవెన్స్ రిసార్ట్ లో ఘనంగా జరిగింది.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *