తమిళ క్రేజీ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం అందరి చూపులు ఈ డైరెక్టర్‌పై పడ్డాయి. షారుఖ్ ఖాన్ కోసం అట్లీ ఎలాంటి కథను తీసుకొస్తున్నాడా.. జవాన్ మూవీతో ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద అట్లీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

తమిళ క్రేజీ డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌తో ‘జవాన్’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం అందరి చూపులు ఈ డైరెక్టర్‌పై పడ్డాయి. షారుఖ్ ఖాన్ కోసం అట్లీ ఎలాంటి కథను తీసుకొస్తున్నాడా.. జవాన్ మూవీతో ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద అట్లీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ డైరెక్టర్ ఇటీవల తండ్రి అయ్యాడనే విషయం తెలిసిందే. తన భార్య ప్రియా మోహన్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చినట్లుగా అట్లీ ఇటీవల తెలియజేశాడు. అయితే తాజాగా తన కుమారుడి పేరును కూడా చెప్పేశాడు. తన భార్య ప్రియా మోహన్‌తో కలిసి తన కొడుకును ఆలయానికి తీసుకెళ్లి నామకరణం చేసినట్లుగా ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే తన కొడుకు పేరు ‘మీర్’గా నామకరణం చేసినట్లుగా తెలిపాడు.

ఇక సోషల్ మీడియాలో ఆయనకు అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా విషెస్ చెబుతున్నారు. ఇక జవాన్ మూవీలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సినిమా మేకర్స్ రెడీ అయ్యారు.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *