రెగ్యూలర్ గా వచ్చే పీరియడ్స్‌తో పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొంత మందికి రెండు మూడు నెలలకు ఓసారి రావడం. అలాంటి సమయంలో ఎక్కువ రక్తస్రావం కావడం, ఎక్కువ రోజులు పీరియడ్స్ ఉండటం జరుగుతుంటుంది. ఇది ఏదో ఒక నెలలో జరిగితే పర్వాలేదు గానీ.. ఎప్పుడూ ఇదే విధంగా ఉంటే మాత్రం శరీరంలో ఏదో తేడా ఉందని అర్థం.
Image Credit source: TV9 Telugu
పీరియడ్స్ మహిళలకు సాధారణమే అయినా నెలనెలా ఆ సమయంలో పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఆ నొప్పిని తట్టుకోలేక అల్లాడిపోతుంటారు. అయితే రెగ్యూలర్ గా వచ్చే పీరియడ్స్‌తో పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొంత మందికి రెండు మూడు నెలలకు ఓసారి రావడం. అలాంటి సమయంలో ఎక్కువ రక్తస్రావం కావడం, ఎక్కువ రోజులు పీరియడ్స్ ఉండటం జరుగుతుంటుంది. ఇది ఏదో ఒక నెలలో జరిగితే పర్వాలేదు గానీ.. ఎప్పుడూ ఇదే విధంగా ఉంటే మాత్రం శరీరంలో ఏదో తేడా ఉందని అర్థం. శరీర ఆరోగ్య సమతుల్యత దెబ్బతిందని తెలుసుకోవాలి. సాధారణంగా పీరియడ్స్ 28 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో వస్తాయి. ఒకటి రెండు రోజులు అటుఇటుగా కూడా ఉండవచ్చు. అంతకు మించి గ్యాప్ పెరిగిపోతే మాత్రం అనుమానిచాల్సిందే. ప్రధానంగా అసాధారణ పీరయడ్స్ పీసీఓఎస్, ఒత్తిళ్లు, లేదా ఏదైనా అనారోగ్య సమస్యల కారణంగా వస్తాయి.
అయితే కొన్ని జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా రుతుచక్రాన్ని క్రమపరచవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణులు లోవనీత్ బాత్రా చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. సరైన ఆహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవచ్చని పేర్కొన్నారు. క్రమరహితంగా పీరియడ్స్ ను కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చని సూచిస్తున్నారు. పీరియడ్స్ ని క్రమపరిచే ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో చూద్దా రండి..
బొప్పాయి.. ఇది ఆరోగ్యాన్నిచ్చే పండు. ఇందులో కెరోటిన్ అనే పోషకం ఉంటుంది. ఇది ఈస్ట్రోజెన్ స్థాయిలకు మద్దతు ఇస్తుంది. ఇది గర్భాశయ సంకోచంలో సహాయపడుతుంది.
వాము(క్యారమ్ సీడ్స్, అజ్వైన్): వాము వాటర్ ను రోజూ ఉదయం సమయంలో తీసుకోవడం మంచిది. ఉదయాన్నే రోజును ఈ వాము వాటర్‌తో ప్రారంభిండచం ఆరోగ్యదాయకం. ఇది రుతు చక్రాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. నీటిలో బాగా మరిగించి తీసుకుంటే పీరియడ్స్ నొప్పి కూడా అదుపులోకి వస్తుంది.
పైనాపిల్: దీనిలో బ్రోమెలైన్ అనే ఎంజైమ్‌లు ఉంటాయి, ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, సక్రమంగా రుతుస్రావం జరగడానికి సహాయపడతాయి. ఇది పీరియడ్స్ ప్రీపోన్ చేయడానికి కూడా సహాయపడవచ్చు.
ఫెన్నెల్: ఇది క్రమరహిత పీరియడ్స్ చికిత్సకు సమర్థవంతమైన మూలిక. ఇది హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. అండోత్సర్గాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది రుతు తిమ్మిరిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
దాల్చిన చెక్క: ఇన్సులిన్ స్థాయిలు హార్మోన్లు రుతు చక్రాలపై కూడా ప్రభావం చూపుతాయి. దాల్చినచెక్క శరీరంలోని ఈ ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఎందుకంటే ఇది గ్లూకోజ్, ఇన్సులిన్‌ను ప్రాసెస్ చేయడానికి శరీర సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌లో కూడా సహాయపడుతుంది.
అలోవెరా: ఇది క్రమరహిత రుతు చక్రాలకు ప్రకృతి అందించిన వరం అని చెప్పాలి. అలోవెరాలో ఫోలిక్ యాసిడ్, అమిన్ప్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ ఉంటాయి. అలాగే విటమిన్ ఎ, సి, ఇ, బి12 పుష్కలంగా ఉంటాయి. ఇది రుతుస్రావం కోసం బాధ్యత వహించే హార్మోన్లను నియంత్రిస్తుంది. ప్రతి నెలా సమయానికి సాధారణ పీరియడ్స్ రావడానికి సాయపడుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..