ఏపీలో ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్నా ప్రధాన పార్టీలు ఇప్పటినుంచే గ్రౌండ్‌లోకి దిగుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. తాము సైతం ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న జనసేన.. అందుకోసం వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే నాగబాబు ఫీల్డ్‌లోకి దిగారు.

ఏపీలో ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్నా ప్రధాన పార్టీలు ఇప్పటినుంచే గ్రౌండ్‌లోకి దిగుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. తాము సైతం ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న జనసేన.. అందుకోసం వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే నాగబాబు ఫీల్డ్‌లోకి దిగారు. అనకాపల్లి జిల్లాలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటించారు. ఎలమంచిలి నియోజకవర్గ రాంబిల్లి మండలం వెంకటాపురం జంక్షన్‌లో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని నాగబాబు ప్రారంభించారు. కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు నాగబాబు. అంతకు ముందు విశాఖ నుంచి నేరుగా పూడిమడక చేరుకున్న నాగబాబు ఘన స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు. పూడిమడక జంక్షన్ నుంచి అనకాపల్లి హైవే వరకు బైక్ ర్యాలీగా వెళ్లారు. జనసేన పార్టీ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ప్రారంభించడానికి నాగబాబు ఇక రెగ్యులర్ గా జిల్లాలు పర్యటించే అవకాశం ఉంది. కాగా ఇప్పటి వరకూ నాదెండ్ల మనోహర్ జనసేన తరపున ఫీల్డ్ విజిట్స్ చేపట్టేవారు. ఇప్పుడు నాగబాబు కూడా ఆ బాధ్యతలు తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారం చేపడుతుందని, ప్రజలందరినీ అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడమే తమ ధ్యేయమని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నాగబాబు హాజరైయ్యే అన్ని కార్యక్రమాలలో జనసేన పార్టీ నాయకులు, సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలోపాల్గొనాలని పార్టీ నాయకులు కోరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నాగబాబు.. ‘జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయితే, స్వ‌ర్ణ‌యుగం వ‌స్తుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తాం.. రాష్ట్రంలో రానున్న‌ది జ‌న‌సేన ప్ర‌భుత్వ‌మే. వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దాదాపుగా దోచుకున్నారని, మరొక్కసారి వైసీపీని నమ్మితే మనకు భవిష్యత్తు లేకుండా చేస్తారని అన్నారు. ఎత్తులు, పొత్తుల గురించి పవన్ కి వదిలేసి జనసేన పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే ప్రతీ వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత జన సైనికులు, వీర మహిళలపై ఉన్నది’ అని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed