ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర వ్యాఖ్యలతో సాలూరులో అలజడి మొదలైంది. సెటిలర్ల వల్ల గిరిజనులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేయడంతో పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరుకు కూడా తీసుకెళ్తానంటున్నారు డిప్యూటీ సీఎం రాజన్న దొర.
ఏపీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సంచలన వ్యాఖ్యలు చేశారు. సెటిలర్స్ వల్ల సాలూరు స్థానికులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన చౌదరి, రెడ్లు వల్ల తామకు నష్టం జరుగుతోందన్నారు డిప్యూటీ సీఎం. ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో భూములు, వ్యాపారాలు అన్ని వాళ్ల చేతుల్లోనే ఉన్నాయన్నారు. గిరిజనుల మీద బతుకుతూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సాలూరులో సంపాదించుకుంటూ అభివృద్ధికి మాత్రం సహకరించడం లేదని ఆరోపణలు గుప్పించారు. బబ్లూ అనే సెటిలర్ అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని పేరు ప్రస్తావించారు రాజన్న దొర. ఈ పరిస్థితి మారాలంటే సాలూరుని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించాలని రాజన్న దొర డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరుకు కూడా తీసుకెళ్తానంటున్నారు డిప్యూటీ సీఎం రాజన్న దొర.
పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు నాగావళి నదీ పరివాహక ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలోకి గుంటూరు, కృష్ణ, ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చినవారు ఇక్కడ స్థిరపడ్డారు. సాలూరు వచ్చి సెటిలైనవారిలో కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు ఎక్కువగా ఉండటం విశేషం. ఎక్కువ పంటలు పండే అవకాశం ఉండటంతో ఇక్కడికి వలస వచ్చారు.
దశాబ్దాల క్రితమే వలస వచ్చి భూములు కొనుగోలు చేశారు ఈ రెండు సామాజిక వర్గాల ప్రజలు. సెటిలర్స్ చేతిలో వేల ఎకరాల భూములు ఉండటం.. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద లారీ పరిశ్రమగా సాలూరు నిలిచింది. ట్రాన్స్‌పోర్టు రంగంలో మరో విజయవాడగా సాలూరుకు గుర్తింపు ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం