తెలుగు, తమిళంలో ఇప్పటికే స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలుగుతున్న సమంత మరో వైపు బాలీవుడ్‌ లో కూడా సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీ వెబ్‌ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2 లో బోల్డ్‌ యాక్టింగ్‌ తో ప్రేక్షకులను సర్‌ ప్రైజ్ చేసిన సమంత ప్రస్తుతం మరో హిందీ సిరీస్‌ లో నటిస్తున్నారు.

తెలుగు, తమిళంలో ఇప్పటికే స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలుగుతున్న సమంత మరో వైపు బాలీవుడ్‌ లో కూడా సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీ వెబ్‌ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2 లో బోల్డ్‌ యాక్టింగ్‌ తో ప్రేక్షకులను సర్‌ ప్రైజ్ చేసిన సమంత ప్రస్తుతం మరో హిందీ సిరీస్‌ లో నటిస్తున్నారు. మరో వైపు వరుసగా కమర్షియల్ యాడ్స్ ను కూడా చేస్తున్నారు. ఇటీవల సమంత పెప్సీ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్ గా సైన్‌ చేసిన సామ్‌, తాజాగా పెప్సీ కమర్షియల్‌ యాడ్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సమంత షేర్ చేసిన పెప్సీ కంపెనీ కమర్షియల్ యాడ్‌ వీడియో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. 50 సెకన్లు ఉన్న ఈ కమర్షియల్‌ యాడ్‌ లో డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్ లో విభిన్నమైన పాత్రల్లో సమంత కనిపించారు. ఈ యాడ్‌లో సమంత లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్‌ హ్యాపీ ఫీలయ్యారు. తాజాగా సామ్‌ చేసిన ఈ యాడ్‌పై టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా స్పందించారు. సమంత యాడ్‌పై స్పందిస్తూ సానియా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. మహిళలు వేసుకునే దుస్తులు, భాగస్వామి ఎంపిక.. ఇలా అన్ని అంశాల్లో అమ్మాయిలపై తమ అభిప్రాయం రుద్దే ప్రయత్నం చేస్తారు. దీనిని దాటుకొని ఓ అమ్మాయి తనకు నచ్చినట్లుగా జీవించాలనే ఉద్దేశ్యం ఈ యాడ్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. దీనిపై సానియా మీర్జా స్పందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Keerthy Suresh: ముఖంపై గాయాలతో మహానటి.. కీర్తి సురేష్‏కు ఏమైంది ??

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *