అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్‌’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైన ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా అటు ప్రొడ్యూసర్స్‌తో పాటు అభిమానులను సైతం నిరాశకు గురి చేసింది. స్పై నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని…

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్‌’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైన ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా అటు ప్రొడ్యూసర్స్‌తో పాటు అభిమానులను సైతం నిరాశకు గురి చేసింది. స్పై నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని చాలా మంది భావించారు. అయితే ఫలితం తలకిందులైంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లివ్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

గత నెల 28వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రాన్ని మే 19న ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే అది కాస్త వాయిదా పడింది. అయితే మే 26న ఓటీటీ వేదికగా విడుదలువుతుందని మరో అప్‌డేట్‌ ఇచ్చారు. అయితే ఈ రోజు కూడా ఏజెంట్ ఓటీటీలో విడుదల కాలేదు. దీంతో ఏజెంట్ ఓటీటీ విడుదల మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు, నిర్మాతలకు మధ్య ఒప్పందాల విషయంలో ఇబ్బందులు ఎదురవడంతో ఓటీటీ విడుదల తేదీ ఆలస్యమవుతున్నట్లు సమాచారం.ఇవి కూడా చదవండిఇక తాజా సమాచారం ప్రకారం ఏజెంట్‌ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ జూన్ 23వ తేదీ నుంచి ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ రోజైనా ఏజెంట్ ఓటీటీలో దర్శనమిస్తుందా.? లేదా అన్నది ప్రశ్నగానే మారింది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే.. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. వక్కంతం వంశీ కథను అందించారు. సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *