సినీనటి డింపుల్‌ హయాతి ఇంట్లోకి ఓ యువతి, యువకుడు ప్రవేశించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌ పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌లో డింపుల్‌ ఆమె సహచరుడు విక్టర్‌ డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు.

సినీనటి డింపుల్‌ హయాతి ఇంట్లోకి ఓ యువతి, యువకుడు ప్రవేశించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌ పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌లో డింపుల్‌ ఆమె సహచరుడు విక్టర్‌ డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో నివసించే ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డేతో పార్కింగ్‌ వివాదంలో డింపుల్‌, డేవిడ్‌లపై ఇప్పటికే కేసు నమోదైంది. గురువారం ఉదయం అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన యువతి, యువకుడు సీ2లో ఉండే డింపుల్‌ నివాసంలోకి వెళ్లారు. పనిమనిషి ఎవరని ఆరా తీసే ప్రయత్నం చేసింది. ఇంతలో ఇంట్లోని కుక్క వారి వద్దకు వెళ్లడంతో భయపడి తిరిగి లిఫ్టులోకి వెళ్లారు. లిఫ్టు లోపలికి వారితో పాటు వెళ్లిన కుక్క తిరిగి వెంటనే బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న డింపుల్‌ వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు యువతీయువకుల్ని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వారిని విచారించగా తాము రాజమండ్రి నుంచి వచ్చామని, డింపుల్‌ అభిమానులమని తెలిపారు. తాజాగా ఘటన నేపథ్యంలో ఆమెను కలవడానికి వచ్చినట్లు తెలిపారు. విషయం ఆమెకు తెలియజేయగా, వారిని విడిచిపెట్టమని చెప్పారు. యువతీయువకులు కొప్పిశెట్టి సాయిబాబు, అతని బంధువు శృతిగా గుర్తించి కౌన్సెలింగ్‌ ఇచ్చి విడిచిపెట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకలే లేని మనిషి.. 17 ఏళ్లుగా పెప్పీ ఒక్కటే !!

ఎయిర్ హోస్టెస్‌తో కలిసి స్కై చిలిపి చేష్టలు.. వీడియో చూస్తే నవ్వులే

ఉచిత పెట్రోలు పంపిణీ.. దొరికినవారికి దొరికినంత..

Alien signal: ఏలియన్స్‌ నుంచి మనకు తొలి మెసేజ్ !!

ఎగిరే బల్లిని చూశారా ఎప్పుడైనా ?? అత్యంత ఖరీదైన జీవులుగా ప్రఖ్యాతి

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *