టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ ముందు 232 పరుగుల టార్గెట్ నిలిచింది.
Gujarat Titans vs Mumbai Indians, Qualifier 2: ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (129) తుఫాన్ సెంచరీ ఆధారంగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 క్వాలిఫయర్-2 ముంబై ఇండియన్స్‌ను గెలవడానికి 234 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 233 పరుగులు చేసింది. ప్లేఆఫ్స్‌లో ఇదే అతిపెద్ద స్కోరు కావడం విశేషం.
గిల్ 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ప్లేఆఫ్స్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గిల్‌తో పాటు సాయి సుదర్శన్ 31 బంతుల్లో 43 పరుగులు చేశాడు. చివరిగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 28 పరుగులు చేశాడు.
ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా, ఆకాశ్ మధ్వల్ చెరో వికెట్ తీశారు.
60 బంతుల్లో 129 పరుగులు చేసి శుభ్‌మన్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ముంబై బౌలర్లను దడదడలాడించాడు. 18 పరుగుల వద్ద వృద్ధిమాన్ సాహా ఔటయ్యాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 28న మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్ ఆడుతుంది. ఓడిన జట్టు ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది.
ICYMI!
A SIX that left everyone in 🤯🤯
How would you describe that shot from Shubman Gill?#TATAIPL | #Qualifier2 | #GTvMI | @ShubmanGill pic.twitter.com/BAd8NDVB0e
— IndianPremierLeague (@IPL) May 26, 2023
ఇరుజట్లు:
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..