డీసీపీ రాహుల్ హెగ్డేతో పార్కింగ్ విషయంలో వివాదం అనంతరం.. టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. గొడవతో మొదలైన ఈ వివాదం.. అధికార దుర్వినియోగం వరకు వెళ్లిందంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి.
డీసీపీ రాహుల్ హెగ్డేతో పార్కింగ్ విషయంలో వివాదం అనంతరం.. టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. గొడవతో మొదలైన ఈ వివాదం.. అధికార దుర్వినియోగం వరకు వెళ్లిందంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సినీనటి డింపుల్ హయాతి ఇంట్లోకి ఓ యువతి, యువకుడు ప్రవేశించడం ఒక్కసారిగా కలకలం రేపింది. డింపుల్ హాయాతి ఫిర్యాదుతో వెంటనే ఇంటికి చేరుకున్న పోలీసులు.. యువతి, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ ఎస్‌కేఆర్ ఎన్‌క్లేవ్‌లో డింపుల్ హయాతి.. ఆమె సహచరుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు.
ఈ క్రమంలో యువతి, యువకుడు ఇద్దరూ.. గురువారం ఉదయం అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించారు. అనంతరం వారిద్దరూ అపార్ట్‌మెంట్ లోని సీ2లో ఉండే డింపుల్ నివాసంలోకి వెళ్లారు. పనిమనిషి ఎవరని ఆరా తీస్తుండగా.. వారి దగ్గరకు వచ్చిన కుక్కను చూసి భయపడి లిఫ్టులోకి పరిగెత్తారు. ఈ విషయం తెలుసుకున్న డింపుల్ హయాతి.. వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని యువతీ యువకుడిని అదుపులోకి తీసుకొన్నారు.
అనంతరం స్టేషన్ కు తరలించి వారిని విచారించగా.. తాము రాజమండ్రి నుంచి వచ్చామని డింపుల్ అభిమానులమంటూ పేర్కొన్నారు. తాజాగా, డీసీపీతో వివాదం నేపథ్యంలో డింపుల్ హయాతిని కలవడానికి వచ్చినట్లు వివరించారు. ఇదే విషయాన్ని డింపుల్ కు పోలీసులు తెలియజేయగా, వారిని విడిచిపెట్టమంటూ తెలిపారు. యువతీయువకులు కొప్పిశెట్టి సాయిబాబు, శృతిగా గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు..
మరిన్ని సినిమా వార్తల కోసం..