మా అసోసియేషన్‌ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కరాటె కళ్యాణిని మా సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. సీనియర్‌ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ మా అసోసియేషన్‌ ఈ నెల 16వ తేదీన షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది

ఇండస్ట్రీలో ఇప్పుడు మరో విషయం హాట్ టాపిక్ చక్కర్లు కొడుతోంది. కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా ఆమె ఎన్నో సినిమాల్లో నటించినా.. సమాజంలో జరిగే విషయాలపై కూడా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మా అసోసియేషన్‌ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కరాటె కళ్యాణిని మా సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. సీనియర్‌ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ మా అసోసియేషన్‌ ఈ నెల 16వ తేదీన షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులపై ఇప్పటివరకు కళ్యాణి స్పందించకపోవడంతో మా అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణిని సస్పెండ్ చేసినట్లు మా సభ్యులు తెలిపారు. తాజాగా కరాటే కళ్యాణి దీని పై స్పందించారు.

ఖమ్మంలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీని పై అభ్యంతరాలు రావడంతో కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే ఎన్టీఆర్ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండటం పై కరాటే కళ్యాణి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఆమె పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమెను మా నుంచి తొలగించారు.

దీని పై ఆమె స్పందిస్తూ..’నేను చేసిన తప్పు ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను మహానటుడు ఎన్టీఆర్‌కు వ్యతిరేకం కాదు. కృష్ణుడి రూపంలో ఆయన విగ్రహం పెడితే సమాజంలోకి తప్పుగా వెళ్తుంది.. ప్రతి హీరోకి దేవుడి రూపంలో విగ్రహం పెడితే ఇక దేవుళ్ల విగ్రహలు ఎందుకు.? మాకు ఆయన ఎంతో ఇష్టమైన దైవం.. అక్కడ ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే.. దేవుడికి అప్రతిష్టే కదా .. విగ్రహ ఏర్పాటును ఆపేయండి అని అడిగాను. మీరు అసోసియేషన్ నుంచి ఇలా మాట్లాడకూడదు అని నాకు షోకాజ్ నోటీసు పంపారు’ అని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు. అయితే వివరణ ఇవ్వడానికి మూడు రోజులు గడువు ఇచ్చారు. కానీ నా ఆరోగ్యం బాలేదు. గొంతుకూడా పోయింది. అందుకే నేను వివరణ ఇవ్వలేదు అని తెలిపారు. తనకు ఇంకా టైమ్ కావాలని ఒక నోటీసు రాసి పంపించా.. దాన్ని లీగల్ నోటీసుగా భావించి తనను సస్పెండ్ చేశారని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *