Cameron Green: ఐపీఎల్ 2023 రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

లక్నో వర్సెస్ ముంబై మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో లక్నోపై భారీ విజయాన్ని నమోదు చేసింది. అదే సమయంలో రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లోకి ప్రవేశించింది. రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్‌తో ముంబై తలపడనుంది. అంతకుముందు జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది.

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన గురించి మాట్లాడితే, ఆ జట్టు గత సీజన్‌లోని చెడు జ్ఞాపకాలను మరచిపోయి క్వాలిఫైయర్ 2కి తమ ప్రయాణాన్ని పూర్తి చేసింది. ముంబై ఇండియన్స్‌కు కెమెరూన్ గ్రీన్ అద్భుతమైన నాక్‌లతో కీలక ప్లేయర్‌గా మారాడు. రూ. 17.5 కోట్లతో ముంబై టీంలో చేరాడు. ముంబై జట్టు ఇప్పుడు ఐపీఎల్ టైటిల్‌కు ఒకడుగు దూరంలో నిలిచింది. రెండో క్వాలిఫయర్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో ముంబై తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడుతుంది.

ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్‌లో రోహిత్ శర్మ గురించి కామెరాన్ గ్రీన్ మాట్లాడుతూ, “రోహిత్ శర్మకు ప్రతిదీ తెలుసు. భారత్‌తో పాటు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం అతనికి ఉంది. ఐపీఎల్‌లో ముంబై తమ తొలి మ్యాచ్‌ను ఎప్పుడూ గెలవలేదని నేను అనుకుంటున్నాను. ఇది అత్యంత ముఖ్యమైనది. మేం నెమ్మదిగా ప్రారంభించాం. కానీ మేం సరైన సమయంలో అత్యుత్తమంగా ఉన్నామంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి



సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ గురించి కెమెరూన్ గ్రీన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే బ్యాటింగ్ చేయడం అత్యంత సులువైన విషయమంటూ చెప్పకొచ్చాడు. “సూర్యకుమార్‌తో బ్యాటింగ్ చేయడం ప్రపంచంలోనే అత్యంత సులభమైన పని అని నేను భావిస్తున్నాను,” అంటూ సూర్యను పొగడ్తలతో ముంచెత్తాడు. అతను స్ట్రైక్ రోటేట్ చేయాలని చూస్తుంటాడు. అలాగే లూస్ బాల్ వస్తే, దానిని బౌండరీకి ​​పంపాలని కోరుకుంటాడు’ అని పేర్కొన్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *