Naveen Ul Haq Vs Virat Kohli: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా లక్నో, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు నవీన్‌ ఉల్‌ హక్ అనేవారు ఉన్నాడని కూడా ఎవరికీ తెలియదు. అయితే ఆ మ్యాచ్‌లో ఏకంగా విరాట్ కోహ్లీతోనే గొడవకు దిగి, టీమిండియా అభిమానులకు..

Naveen Ul Haq Vs Virat Kohl

Naveen Ul Haq Vs Virat Kohli: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా లక్నో, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు నవీన్‌ ఉల్‌ హక్ అనేవాడు క్రికెట్‌లో ఉన్నాడని కూడా చాలా మందికి తెలియదు. అయితే ఆ మ్యాచ్‌లో ఏకంగా విరాట్ కోహ్లీతోనే గొడవకు దిగి, టీమిండియా అభిమానులకు టార్గెట్‌గా మారాడు. అవకాశం దొరికినప్పుడల్లా కింగ్ కోహ్లీని ట్రోల్ చేస్తూ అభిమానులను రెచ్చగొడుతూ వచ్చాడు. అలా ఈ అఫ్గానిస్థాన్ బౌల‌ర్ నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నాడు. అయితే Naveen Ul Haq అనే ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన కొన్ని ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటితో నవీన్ తన స్థాయేమిటో తెలుసుకున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఆ ట్విట్టర్ ఖాతా నుంచి ‘నన్ను క్షమించండి విరాట్ సార్’.. ‘నా జీవితంలో చేసిన పెద్ద తప్పు(విరాట్‌తో గొడవ ఫోటోలు)’.. ‘మూడో ప్రపంచ యుద్ధం కంటే విరాట్ సార్‌తో గొడవే పెద్ద ప్రమాదం’.. ‘నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను. ఆర్సీబీ ఫ్యాన్స్ నన్ను క్షమించాలి. ఇంకెప్పుడూ సీనియర్లతో గొడవకు దిగను. లక్నో టీమ్‌పై విజయం సాధించిన ముంబై ఇండియన్స్‌కి అభినందనలు’ అంటూ కొన్ని వరుస ట్వీట్స్ ఉన్నాయి. అసలు అవి నిజంగా నవీన్ ఉల్ హక్ చేసిన ట్వీట్స్‌యేనా..? ఆ ట్విట్టర్ ఖాతా నిజంగా అతనిదేనా..? అనే చర్చలు నెట్టింట సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆ ట్విట్టర్ ఖాతాను పరిశీలించగా.. అది ఫేక్ అకౌంట్ అని అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి



ఏదేమైనప్పటికీ.. విరాట్ కోహ్లీ అనే వ్యక్తి క్రికెట్ ప్రపంచంలో శిఖరాగ్రం లాంటివాడని, నవీన్ ఉల్ హక్ విరాట్ ముందు చాలా చిన్న ప్లేయర్ అని అటు క్రికెట్ విశ్లేషకులు, ఇటు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా విరాట్ లేకపోతే భారత జట్టుకి బలహీనత.. కానీ నవీన్ ఉంటేనే ఆఫ్ఘానిస్థాన్ టీమ్‌కి బలహీనత అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *