రాజేష్ కుమార్. హిస్సార్ జిల్లాలోని హిద్వాన్ గ్రామ నివాసి. ఇంతకుముందు సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. అయినప్పటికీ డబ్బులు సరిపోక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొనేవాడు. అప్పుడు ఒక ఒక తోటమాలి రాజేష్ కుమార్ కి గులాబీలను పండించమని సలహా ఇచ్చాడు.

హర్యానా పేరు వినగానే ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేది గోధుమలు, వరి సాగు. ఇక్కడ రైతులు వరి, గోధుమలు మాత్రమే సాగు చేస్తారని ప్రజలు అనుకుంటారు. అయితే హర్యానాలో కూడా ఇతర రాష్ట్రాల్లో వలే  రైతులు ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. కూరగాయలు, పువ్వుల సాగుతో రైతులకు మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. విశేషమేమిటంటే ఉద్యాన పంటలపై హర్యానా ప్రభుత్వం రైతులకు సబ్సిడీ కూడా ఇస్తోంది. ఆధునిక పద్దతిలో గులాబీల సాగు చేస్తూ ప్రజల ముందు ఆదర్శంగా నిలిచిన ఓ రైతు గురించి ఈ రోజు తెలుసుకుందాం..

కిసాన్ తక్ నివేదిక ప్రకారం ఆ రైతు పేరు రాజేష్ కుమార్. హిస్సార్ జిల్లాలోని హిద్వాన్ గ్రామ నివాసి. ఇంతకుముందు సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. అయినప్పటికీ డబ్బులు సరిపోక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొనేవాడు. అప్పుడు ఒక ఒక తోటమాలి రాజేష్ కుమార్ కి గులాబీలను పండించమని సలహా ఇచ్చాడు. దీని తర్వాత రాజేష్ సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు. సొంత గ్రామమైన హిద్వాన్ కు చేరుకున్నాడు. తనకు పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో సేంద్రియ పద్ధతిలో గులాబీ సాగు ప్రారంభించాడు. ప్రస్తుతం రాజేష్ ఆరు ఎకరాల్లో గులాబీల సాగు చేస్తున్నాడు. దీంతో నెలలో 80 కేజీల వరకు గులాబీ పూలను ఉత్పత్తి చేస్తున్నాడు. తాను పండించిన గులాబీ పూలను మార్కెట్‌లో తానే సరఫరా చేస్తున్నాడు రాజేష్.

ఏడాదికి 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్న రాజేష్.. 

ఇవి కూడా చదవండిగులాబీ పువ్వులను మార్కెట్ లో అమ్మడం మాత్రమే కాదు.. తమ పొలంలో పండే గులాబి పువ్వుల నుంచి షర్బత్, రోజ్ వాటర్, గుల్కంద్ తయారుచేస్తారు. రాజేష్ తన భార్య కలిసి ఇంటింటికీ వెళ్లి తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయిస్తారు. గులాబీ సాగుతో ఏడాదిలో రూ.5 లక్షల ఆదాయం వస్తోందని రాజేష్ చెబుతున్నాడు. విశేషమేమిటంటే.. ఇప్పుడు రాజేష్ ఇతర రైతులకు కూడా సేంద్రియ పద్ధతిలో గులాబీ పూల సాగు చేసేందుకు శిక్షణ ఇస్తున్నాడు. గ్రామంలోని 40 మంది రైతులు గులాబీ సాగు చేపట్టి.. లబ్ధి పొందుతున్నారు.

ఆవు పేడే ఎరువు  

తన పొలంలో పండే గులాబీ పూలకు, వాటితో తయారయ్యే ఉత్పత్తులకు మార్కెట్‌లో క్రమంగా డిమాండ్ పెరుగుతోందని రైతు రాజేష్ కుమార్ చెబుతున్నారు. తన పొలంలో ఎప్పుడూ ఆవు పేడనే ఎరువుగా వినియోగిస్తానని చెప్పాడు. సిర్సా, హిసార్, ఫతేహాబాద్, చండీగఢ్, మొహాలి, అంబాలా, రోహ్‌తక్, భివానీ, బహదూర్‌గఢ్, పంచకులకి వెళ్లి తమ ఉత్పత్తులను స్వయంగా సరఫరా చేస్తాడు. రాజేష్ తన భార్యతో కలిసి ప్రతిరోజూ ఉదయం గులాబీ పువ్వులు కోస్తారు. తర్వాత మార్కెట్‌కి తీసుకెళ్లి అమ్ముతారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *