ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఎన్టీ రామారావు పురస్కారం అందుకున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బ్రహ్మానందానికి ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 35 మందికి ఎన్టీఆర్ సెంటినరీ..

NTR Award to Brahmanandam
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఎన్టీ రామారావు పురస్కారం అందుకున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బ్రహ్మానందానికి ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 35 మందికి ఎన్టీఆర్ సెంటినరీ పురస్కారాలు అందించారు. ఎక్స్‌రే సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం రాత్రి అవార్డులను ప్రధానం చేశారు. ఈ ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో తక్కువ సినిమాలే నటించినా ఆయన వద్ద ఎంతో నేర్చుకున్నానన్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ యుగం స్వర్ణ యుగమని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు పురస్కారం అందుకోవడం మహాభాగ్యమని హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు.
కాగా ప్రతీ యేట స్వర్గీయ ఎన్టీ రామారావు పేరిట అవార్డును ప్రధానం చేయడం పరిపాటి. ఈ ఏడాది నిర్వహించిన అవార్డు ప్రధానోత్సవాల సభను ఎక్స్‌రే సేవా సంస్థ అధ్యక్షుడు కొల్లూరి నిర్వహించారు. శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్‌రావు, టీడీపీ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.