ఐపీఎల్‌ 2023 క్వాలిఫయర్‌ 2లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి.. గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌ 2023 క్వాలిఫయర్‌ 2లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి.. గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. గుజరాత్ విజయంలో ఆ జట్టు ప్లేయర్స్ శుభ్‌మాన్‌ గిల్‌, మోహిత్‌ శర్మ కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్‌లో గిల్ 60 బంతుల్లోనే 10 సిక్సర్లు, 7 ఫోర్లతో 129 పరుగులు చేయడంతో.. గుజరాత్‌ నిర్ణీత ఓవర్లకు 233 పరుగులు చేయగలిగింది. ఇక బౌలింగ్‌లో మోహిత్ శర్మ 5 వికెట్లు పడగొట్టి.. ముంబై బ్యాటింగ్‌ను దెబ్బతీశాడు. ముంబై బ్యాటింగ్‌లో తిలక్‌ వర్మ(43), సూర్యకుమార్ యాదవ్(61), కామెరాన్ గ్రీన్(30) రాణించినప్పటికీ.. చివరివరకు నిలవలేదు. దీంతో 171ఆలౌటై.. 62రన్స్‌ తేడాతో ఓడింది ముంబై.

ఇదిలా ఉంటే.. గుజరాత్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి కారణం అదేనంటూ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. గిల్ ఇచ్చిన క్యాచ్‌ను టిమ్ డేవిడ్ వదలడం.. అతడికి పెద్ద లైఫ్ లైన్ ఇచ్చినట్లయ్యిందని అంటున్నారు. గుజరాత్ ఇన్నింగ్స్‌ సమయంలో శుభ్‌మాన్ గిల్ 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌ను టిమ్ డేవిడ్ వదిలేశాడు. దీంతో గిల్ 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఒక్క డ్రాప్ క్యాచ్ విలువ 99 రన్స్ అని.. ఒకవేళ గిల్ 30 పరుగుల వద్ద అవుట్ అయ్యింటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని ట్వీట్లు పెడుతున్నారు. ఈ ఒక్కటే కాదు.. గిల్ 37 పరుగుల వద్ద కిషన్ స్టంపింగ్ మిస్ చేయడం, ఆ నెక్స్ట్ బంతికే తిలక్ వర్మ కూడా గిల్ ఇచ్చిన క్యాచ్‌ పట్టలేకపోవడం జరిగింది. దీంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన గిల్.. సెంచరీ బాదేశాడు. ముంబైను చిత్తుగా ఓడించాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *