బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకోవడమే కాకుండా.. ఆయన ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ.. తన క్రేజ్ ను ప్రపంచమంతా ఫ్యాన్స్ ను పెంచుకున్నాడు మన డార్లింగ్.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకోవడమే కాకుండా.. ఆయన ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ.. తన క్రేజ్ ను ప్రపంచమంతా ఫ్యాన్స్ ను పెంచుకున్నాడు మన డార్లింగ్. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. కృతిసనన్ సీత పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో  పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్నారు. సలార్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది.

అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్, అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు. డార్లింగ్ ను అభిమానించే వాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో ప్రభాస్ పెద్దగా యాక్టివ్ గా ఉండరు. తన సినిమా ప్రమోషన్స్ తో పాటు .. ఇతర సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తుంటారు ప్రభాస్.

ఇదిలా ఉంటే ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళు దాదాపు 10 మిలియన్ కు పైగా ఫాలో అవుతున్నారు. అయితే ప్రభాస్ మాత్రం 15 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అయితే ప్రభాస్ ఫాలో అవుతున్న వారిలో హీరోయిన్స్ ఆరుగురు ఉన్నారు. ఆ ఆరుగురు హీరోయిన్స్ ఎవరంటే.. భాగ్య శ్రీ, శ్రుతిహాసన్, శ్రద్దా కపూర్, పూజాహెగ్డే, కృతిసనన్ , దీపికా పడుకొని ఫాలో అవుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *